![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -329 లో.... స్కూల్ ఆనివల్ డే కీ మైథిలి వస్తుంది. అందరు తనకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. పెద్దాయన మైథిలిని అందరికి పరిచయం చేస్తాడు. తను నా మనవరాలు. మైథిలి గ్రూప్ ఆఫ్ కంపేనీస్ కి ఏకైక వారసురాలని చెప్తాడు. ఇక నుండి ఈ స్కూల్ ప్రిన్సిపల్ తనే అని పెద్దాయన చెప్పగానే.. స్కూల్ ఎండింగ్ లో కాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుండేదని అక్కడున్నా అతను అంటాడు. ఈ గ్యాప్ లో నేను అన్ని విషయాలు తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ కి పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే ఇలా అని మైథిలి చెప్పగానే.. అందరు ఇంప్రెస్ అవుతారు.
అదే స్కూల్ కి సీతాకాంత్ రామ్ ని తీసుకొని వస్తాడు. సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతుంటే రామ్ పరిగెత్తుకొని వెళ్లి పడిపోతాడు. అది చూసి మైథిలి వచ్చి రామ్ ని లేపి దెబ్బ ఎక్కడ తగిలిందంటూ అడుగుతుంది. రామ్ మాట్లాడుతుంటే.. తన మాటలకి మైథిలి ఇంప్రెస్ అవుతుంది. మా నాన్నని చూడాలంటూ రామ్ వెళ్ళిపోతాడు. సీతాకాంత్ కి వెళ్లి తను పడిపోయిన విషయం చెప్తాడు. మరొకవైపు పెద్దాయన మైథిలి బాధ్యతలు చేపడుతున్నందుకు చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగా వచ్చి ఈ ల్యాండ్ నాకు ఇవ్వండి స్కూల్ కూల్చేసి బార్ పెడతానంటూ అడుగుతాడు. దానికి పెద్దాయన ఒప్పుకోడు. దాంతో రంగా బయటకు వచ్చి ఇప్పుడు అందరు పిల్లలున్నారు. బాంబ్ పెట్టు అందరు చనిపోతారని రంగా తన మనిషికి చెప్తాడు.
ఆ తర్వాత స్కూల్ ఆనివల్ డే కి అందరు పేరెంట్స్ వస్తారు. కల్చరల్ ఆక్టివిటీస్ మొదలవుతాయి. రౌడీ బాంబ్ ని గిఫ్ట్ రూపంలో ప్యాక్ చేసి అక్కడ పెడతాడు. ఒక అబ్బాయి స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతుంటే.. వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తుంది. అది చూసి నీకు అమ్మ లేదని భాదపడుతున్నావా అని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. అదేం లేదు నువ్వు నాకు బెస్ట్ నాన్నవి అంటూ సీతాకాంత్ గురించి రామ్ గొప్పగా చెప్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |